శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:13:25

ఇలా చేయూతనివ్వండి

ఇలా చేయూతనివ్వండి

  • సరుకులు అందజేయాలన్నా.. అన్నదానం చేయాలన్నా.. జీహెచ్‌ఎంసీని సంప్రదించండి 

సిటీబ్యూరో:  కరోనావ్యాప్తి నేపథ్యంలో పేదలకు సాయం చేయాలనుకునే దాతలు జీహెచ్‌ఎంసీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అన్నార్తులకు అన్నదానం చేయాలనుకునేవారికి అభాగ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ అందజేసే ఆలోచన ఉన్నవారందరూ జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబరు 040-21 11 11 11కు ఫోన్‌ చేసి వివరాలు పొందవచ్చు. లేదంటే http://covid123.in/ అనే యాప్‌ ద్వారా మనకు కావాల్సిన ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆహారం కావాల్సినవారు, తమ ప్రాంతాల్లో ఏమైనా పంపిణీ చేయాలనుకునేవారు, అన్నపూర్ణ కేంద్రాల సమాచారం కావాల్సినవారు, రేషన్‌ కావాల్సినవారు https://ts.meeseva. telangana.gov.in/Cheyutha/UserInterface/Citizen/RevenueServices/ Cheyutha.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.  9154686549, 91546 86552, 9154686557, 9154686558 నంబర్లకూ ఫోన్‌ చేయొచ్చు. బీ ఏ డోనర్‌..బీ ఏ వలంటీర్‌ http://covid123.in/ మొబైల్‌ యాప్‌లోకి ప్రవేశించిన తర్వాత భోజనం, రేషన్‌ కావాలనుకున్న వారు ‘ఆస్క్‌ హెల్ప్‌' అనే ఆప్షన్‌లోకి వెళ్లి తామున్న లొకేషన్‌ తెలియజేస్తే వలంటీర్లు అక్కడికి చేరుకొని సంప్రదిస్తారు. పేదల సహాయార్థం డబ్బు, భోజన ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, లేక బట్టలు తదితర సహాయం చేయాలనుకుంటే ‘బీ ఎ డోనర్‌' అనే ఆప్షన్‌ ఎంచుకొని  సమాచారం ఇస్తే  సంబంధిత అధికారులు సంప్రదిస్తారు. ఎవరైనా సొంతంగా తమ సమీపంలో నివాసం ఉంటున్న వారికి సాయం అందించాలనుకుంటే ‘బీ ఎ వలంటీర్‌' అనే ఆప్షన్‌లోకి వెళ్తే అధికారులు సంప్రదించి భోజన ప్యాకెట్లు, లేక వస్తువుల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తారు. 


logo