శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:11:58

ఉల్లంఘనలు 10 లక్షలు

ఉల్లంఘనలు 10 లక్షలు

  • లక్షకు పైగా బండ్లు సీజ్‌
  • నియమాలు గాలికి వదిలేస్తున్న నగరవాసులు
  • నెల రోజుల వ్యవధిలోనే
  • నిర్ఘాంత పోయే విశ్లేషణ
  • లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పట్టించుకోని వైనం 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ఓ బాధ్యతగా పాటించడంలో నగరవాసులు విఫలమవుతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అందరూ ఇండ్లలో ఉండాలని ముఖ్యమంత్రి నుంచి పోలీసుల వరకు దండం పెట్టి కోరుతున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోనట్టే ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాల్లో మొత్తం 10 లక్షలకు పైగా చలాన్లు జారీ అయ్యాయి. లక్షకు పైగా వాహనాలను సీజ్‌ చేశారు.  వీటన్నింటిపై లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పోలీసులు కోర్టుల్లో చార్జీషీటులను దాఖలు చేయనున్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఆధారంగా ఉల్లంఘనదారులకు జరిమానా లేదా  జైలు శిక్ష  విధించనున్నారు.logo