సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:04:36

సహృదయత చాటుకున్నారు..

సహృదయత చాటుకున్నారు..

 • టీఆర్‌ఎస్‌ భోలక్‌పూర్‌ డివిజన్‌ కార్యదర్శి వై.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంక్‌ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పేదలకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. 
 • బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదర్షకోట్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సరుకులు అందజేశారు. కార్పొరేటర్లు సంతోషి, చంద్రశేఖర్‌, సాగర్‌గౌడ్‌, నాగరాజు పాల్గొన్నారు.
 • కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో 3వ వార్డు అంబేద్కర్‌నగర్‌లో రేషన్‌కార్డులు లేని పేదలకు డీసీ శైలజ ఆధ్వర్యంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రాజెక్టు అధికారి ఇందిర, ఏసీపీ కుద్దూస్‌, అధికారులు పాల్గొన్నారు. 
 • బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి పేదలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. 
 • బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో జెన్‌ప్యాక్ట్‌ సంస్థ వారు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పంపిణీ చేశారు. అనంతరం కూల్‌కటీ సంస్థ వారు చిగిరింత దయాకర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు సీపీ ఆహార పొట్లాలను అందజేశారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఏసీపీ యాదగిరిరెడ్డి, దాత రాచకొండ కమిషనర్‌రేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ సతీశ్‌, సీఐ నరేందర్‌, మాతృదేవోభవ అనాథ ఆశ్రమ చైర్మన్‌ గిరి, నిమ్మల శ్రీకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు. 
 • నిజాంపేట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 20వ వార్డు రెడ్డి ల్యాబ్స్‌ సమీపంలో జరిగిన అన్నదానంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలా గోపాల్‌రెడ్డి పలువురు పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈఎన్‌ఎంసీ కమిషనర్‌ గోపీ, కార్పొరేటర్లు కాసానీ సుధాకర్‌ పాల్గొన్నారు.
 • 18వ వార్డు పరిధిలోని శ్రీహోమ్స్‌ వద్ద దాత శ్రీకాంత్‌రెడ్డి సహకారంతో పేదలు, వలస కార్మికులకు అన్నదానం చేశారు. నిజాంపేట మేయర్‌ కొలన్‌ నీలా గోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ, కార్పొరేటర్‌ కొలన్‌ వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 • మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో 600 మంది వలస కూలీలకు ప్రభుత్వం తరుఫున 12కిలోల బియ్యంతోపాటు రూ.500 నగదును రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు.
 • టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ కుమారుడు సయ్యద్‌ అసద్‌తో కలిసి పేదలు, వ్యవసాయ వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు సరుకులు పంపిణీ చేశారు.
 • మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో ధన్వి హెల్త్‌కేర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్థానిక నేత నీలేశ్‌ప్రసాద్‌ దూబే ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
 • గచ్చిబౌలి డివిజన్‌లోని రాయదుర్గం దర్గా ప్రభుత్వ పాఠశాలలో పేదలకు శేరిలింగంపల్లి డిప్యూటీ తహసీల్దార్‌ సమక్షంలో 12కిలోల బియ్యం, రూ.500 నగదును కార్పొరేటర్‌ కొమొరిశెట్టి సాయిబాబా 
 • అందజేశారు.
 • జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 7వ డివిజన్‌ బీజేఆర్‌నగర్‌లో కార్పొరేటర్‌ ఆశ ప్రదీప్‌కుమార్‌తో కలిసి మేయర్‌ మేకల కావ్య వెయ్యి మంది పేదలకు 50 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. 
 • కరోనా వైరస్‌ కట్టడికి శ్రమిస్తున్న కార్ఖానా పోలీసులకు సూర్య ఎన్‌క్లేవ్‌కు చెందిన ఉపేందర్‌, విజయ్‌కుమార్‌, బంటి నిత్యావసర సరుకులు స్థానిక బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌తో కలిసి ఇన్‌స్పెక్టర్‌ పి.మధుకర్‌స్వామికి అందజేశారు. 
 • టీటీడీ సలహామండలి కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు దర్గా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాలాపేటలోని తన నివాసం వద్ద జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • అడ్డగుట్ట డివిజన్‌ పరిధిలోని తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పేదలకు సీఐ ఎల్లప్ప, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ తిమ్మప్ప నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
 • శ్రీపురం కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు డీడీకాలనీలోని అహోబిల మఠంలో ఎన్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి ఆధ్వర్యంలో  రమణాచారి వ్యక్తిగత సహాయకుడు సీ.హెచ్‌.లక్ష్మణాచారి 50 మంది పురోహితులకు నిత్యావసరాల సరుకులను  అందించారు.
 • మహేశ్వరం ఆర్టీసీ డిపోకు చెందిన ఔట్‌సోర్సింగ్‌  ఉద్యోగులకు డిపో మేనేజర్‌ ఇసాక్‌ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాల సరుకులను   పంపిణీ చేశారు. 


logo