శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:03:24

మనసుకు భారంగా.. ఇంటికి దూరంగా..

మనసుకు భారంగా.. ఇంటికి దూరంగా..

కంటోన్మెంట్‌, నమస్తే తెలంగాణ : కరోనా నియంత్రణలో వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న సేవలు మాటల్లో చెప్పలేనివి. ప్రాణాంతక వ్యాధితో పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని ఎంతోమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మనసుకు భారమైనా సరే.. ఇండ్లకు దూరంగా ఉంటున్నారు. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు కొందరు పోలీసులు, పారిశుధ్య సిబ్బంది. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

  • తన ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు ఉండడంతో ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తమ కుటుంబానికి హాని కలుగొద్దన్న ఉద్దేశంతో ఠాణా సమీపంలో ఓ విల్లా అద్దెకు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
  • గాంధీ దవాఖానలో పనిచేసే ఓ డాక్టర్‌  కొంతమంది వైద్యులతో కలిసి దవాఖాన సమీపంలోనే గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఒక్క ఆయనే కాదు.. గాంధీలో పనిచేసే చాలా మంది వైద్యులు, నర్సులు, పరిపాలన, టెక్నికల్‌ స్టాఫ్‌ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. విధులు నిర్వహిస్తున్నారు.
  • సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌లో పనిచేసే  ఓ పారిశుధ్య కార్మికురాలు సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంది. తన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని.. డ్యూటీ చేసి ఇంటికి వెళ్తే కుటుంబానికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా మంది పారిశుధ్య కార్మికులు సైతం ఇదే తరహాలో పనిచేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రత్యేక వసతి ఏర్పాటు చేసుకున్నారు. 


logo