శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:02:20

లక్షన్నర మందికి భోజనాలు

లక్షన్నర మందికి భోజనాలు

  • ‘అక్షయపాత్ర’ను సందర్శించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  అన్నపూర్ణ కేంద్రాలు, మొబైల్‌ సెంటర్ల ద్వారా జంటనగరాల్లోని 200 చోట్ల లక్షన్నర మందికి రెండు పూటలా భోజనాలు అందిస్తున్నట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన నార్సింగిలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సందర్శించారు. అక్కడ వంటల తయారీ విధానాలను పరిశీలించారు. అనంతరం ఔటర్‌లో హెచ్‌ఎండీఏ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నార్సింగి సర్కిల్‌ వద్ద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌జీసీఎల్‌ ఎండీ సంతోష్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డి, అర్బన్‌ ఫారెస్ట్రీ డీఎఫ్‌వో ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo