బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 23:31:56

‘గాంధీ’ సూపరింటెండెంట్‌గా రాజారావు బాధ్యతల స్వీకరణ

‘గాంధీ’  సూపరింటెండెంట్‌గా రాజారావు బాధ్యతల స్వీకరణ

బన్సీలాల్‌పేట్‌, ఏప్రిల్‌ 21: కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌గా జనరల్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.రాజారావు మంగళవారం బాధ్యతలు  చేపట్టారు. అంతకుముందు ఇక్కడ సూపరింటెండెంట్‌గా మూడేండ్లు పనిచేసిన డాక్టర్‌ పి.శ్రావణ్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌-19 బాధితులకు చికిత్స అందించే దవాఖానాల కన్వీనర్‌గా నియమితులయ్యారు. 

గాంధీలో 692 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు 

వివిధ దవాఖానాల నుంచి పాజిటివ్‌ లక్షణాలతో వచ్చిన 692 మంది కరోనా వైరస్‌ బాధితులు ప్రస్తుతం నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీలో చికిత్స పొందుతున్నారని, అందులో 89 మంది చిన్నారులు  ఉన్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో 142 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారని, మంగళవారం 10 మంది చిన్నారులను డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు పలు రకాల అనారోగ్య సమస్యలతో 13 మంది కోవిడ్‌ బాధితులు                మరణించారని తెలిపారు.logo