గురువారం 28 మే 2020
Hyderabad - Apr 21, 2020 , 23:28:03

సర్కార్‌కు సహకరించండి

సర్కార్‌కు సహకరించండి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని మంత్రులు జగదీశ్‌రెడ్డ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం గ్రేటర్‌ వ్యాప్తంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో నల్లగొండకు చెందిన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆశ వర్కర్లు, వైద్యసిబ్బంది, జర్నలిస్టులకు, వీఆర్‌ఓలకు పండ్లు పంపిణీ చేశారు.

  • మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నందిహిల్స్‌ 10వ వార్డు కార్పొరేటర్‌ ముద్ద పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు, పేదలకు మూడు నెలలకు సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి పాల్గొన్నారు. 
  • ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌ గ్రామ  సర్పంచ్‌ కాలేరు సురేశ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
  • మల్లాపూర్‌ డివిజన్‌లో హమాలీ పౌరసరఫరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీను ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి, సతీశ్‌, నాయకులు పాల్గొన్నారు. 
  • ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని జైజవాన్‌కాలనీలో కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పంపిణీ చేశారు. 
  • సోలిస్‌ వైద్యశాల చైర్మన్‌ నందనంపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో కార్మికులకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, రాచకొండ పోలీసు కమిషర్‌ మహేశ్‌ భగవాత్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి నిత్యావసర  అందజేశారు.
  • గౌడవెల్లి, సాకేత్‌ భూసత్వ, రాయిలాపూర్‌ గ్రామాల్లో ఉన్న నన్నేమ్స్‌, హెచ్‌ఎం క్లాజ్‌ కంపెనీలకు చెందిన 400 మంది కార్మికులకు నెల రోజులకు సరిపడ సరుకులను సఫా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు.


logo