మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 00:27:27

ఆపదలో.. ఆదుకుంటున్నారు..!

ఆపదలో.. ఆదుకుంటున్నారు..!

 • పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి పేదలకు, ఆటో డ్రైవర్లకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  
 • వైశ్య వికాస వేదిక, కాచం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేట మారుతీనగర్‌లో తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి పేద బ్రాహ్మణులకు సరుకులను ఇచ్చారు. 
 • ఉప్పల్‌లో  ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌, గోమాత ఫౌండేషన్‌, కాప్రా మున్సిపల్‌ కార్యాలయంలో హిందుస్తాన్‌ స్టేట్స్‌ అండ్‌ గైడ్స్‌, కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఏసీపీ వై.నర్సింహారెడ్డి, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు ఇచ్చారు.    
 • కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ జీడిమెట్లకు చెందిన 250 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు. 
 • ‘చలపతి చారిటబుల్‌ ట్రస్ట్‌' ఆధ్వర్యంలో హేమవతినగర్‌ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • బోరబండలో ‘అవతార్‌ ట్రస్ట్‌' ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, సంస్థ ఛైర్మన్‌ ప్రసాద్‌ గుప్తా నిత్యావసర సరుకులను అందజేశారు. 
 • శంషాబాద్‌ పరిధిలోని ఎయిర్‌పోర్టు కాలనీలో జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌, కౌన్సిలర్‌ మునగాల అమృతారెడ్డి ఆధ్వర్యంలో, శంషాబాద్‌ మున్సిపల్‌ 17వ వార్డు కౌన్సిలర్‌ మేకల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • అల్వాల్‌ సర్కిల్‌ వెంకటాపురంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఎస్సార్టీ కమ్యూనిటీహాల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌సింగ్‌ ఆధ్వర్యంలో బర్కత్‌పురలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు.
 • అశోక్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
 • మోహన్‌నగర్‌లో మేకల చిత్తయ్య మెమోరియల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ చిలుకమ్మ ఆధ్వర్యంలో, మోహన్‌నగర్‌ ప్రజయ్‌ నివాస్‌ ఫేజ్‌ 2 వద్ద పువ్వాడ సత్యనారాయణ మూర్తి, వన వెంకటేశ్వర్లు, దాద వెంకటేశ్‌ ఆధ్వర్యంలో,  బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని బ్యాంక్‌ కాలనీ, పాపిరెడ్డి కాలనీలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో, వీరన్నగుట్ట కాలనీలో కేబీఆర్‌ కన్వెన్షన్‌ ట్రస్టు ఎండీ కొప్పుల జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 4 వ వార్డు కార్పొరేటర్‌ శ్రీరాములు ఆధ్వర్యంలో  2వేల మందికి, 14వ వార్డుపరిధిలోని సిరిఎన్‌క్లేవ్‌ లో 200 మందికి మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ కొలన్‌ వీరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్పొరేటర్‌ మన్నెం విజయలక్ష్మిసుబ్బారావు ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. తిరుసంకల్ప గేటేడ్‌ కమ్యూనిటీ వద్ద నల్లమల్లీస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ చైర్మన్‌ సామ్రాజ్యలక్ష్మి 5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు.
 • జవహర్‌నగర్‌ సంతోష్‌నగర్‌లో, బాలాజీనగర్‌ అంబేద్కర్‌నగర్‌లోని పేదలకు, దివ్యాంగులకు మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లు నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్పొరేటర్లు ప్రేమల, మెట్టు ఆశా ప్రదీప్‌ కుమార్‌, శారద మనోధర్‌రెడ్డి, చిత్ర, శాంతి, సంగీత, బాబు తదితరులు తమ డివిజన్లలో నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • తమిళనాడుకు చెందిన ఇద్దరు కార్మికులు లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి శామీర్‌పేట కట్టమైసమ్మ బ్రిడ్జి కింద ఉంటున్నారు. గమనించిన అలియాబాద్‌ గ్రామ వీఆర్‌ఏలు నీరుడి బాలేశ్‌, సల్ల మల్లీశ్వరి, కె.సత్తమ్మ సరుకులు అందజేశారు. 
 • శ్రీ శైవ మహాపీఠం జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో కవాడిగూడ శంకర ఆరాధ్య మఠంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ పాల్గొని 9 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పనిచేసే 250 మంది హోమ్‌గార్డులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.
 • బీహార్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నివాసముంటున్న బిహార్‌ వలస కార్మికులకు సరుకులు  ఇచ్చారు.
 • టీఆర్‌ఎస్‌ స్టేట్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్‌, బండ్లగూడలో వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ డ్రైవర్లు భోజన సదుపాయం కల్పించారు. 
 • రౌండ్‌ టేబుల్‌ ఇండియా, రోటరీ క్లబ్‌ సభ్యులు షేర్‌ టూ కేర్‌లో భాగంగా ఇప్పటికే లక్షా యాభై వేల మందికి అన్నదానం చేశారు. ప్రతి రోజు 8 వేల మందికి పైగా అన్నదానం చేస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు. 
 • అల్వాల్‌ ప్రెసిడెంట్‌ కాలనీలో సానియా మిర్జా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, గౌలిదొడ్డిలో మున్సిపల్‌ చైర్మన్‌ రేఖ ఆధ్వర్యంలో కార్మికులకు సరుకులు ఇచ్చారు.
 • తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ, యూత్‌ ఫీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా, అల్లీపురంనకు చెందిన వలస కూలీలకు సుచిత్ర ప్రాంతంలో అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, మైటి స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నందా పాండే నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఫొటోగ్రాఫర్‌, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
 • హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సభ్యులకు సోమవారం క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, ఉపాధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, సహాయ కార్యదర్శి కంబాలపల్లి కృష్ణ, ఈసీ సభ్యులు పి.అనిల్‌కుమార్‌, గణేశ్‌, నిత్యావసర వస్తువులు, శానిటైజర్‌, మాస్కులను అందజేశారు. 


logo