గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:48:59

రక్తదానం చేయండి

రక్తదానం చేయండి

  • తలసేమియా, డయాలసిస్‌ రోగులను ఆదుకుందాం
  • ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి ఈటల పిలుపు 
  • ప్రజలకు  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం 
  • రక్తదాన శిబిరంలో మంత్రులు తలసాని, ఈటల 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో రక్తదానం చేసేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని నీలిమ హాస్పిటల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈటల  ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు. తలసేమియా, డయాలసిస్‌ రోగులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందించారు.  ప్రభుత్వం ఇచ్చే పిలుపునకు సనత్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు గర్వంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. సంకేత్‌ సంస్థ ఆధ్వర్యంలో 70 మంది, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్‌ నేతృత్వంలో 30, టీఆర్‌ఎస్‌ నాయకుడు తలసాని స్కైలాబ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో 25, అమీర్‌పేట కార్పొరేటర్‌ శేషుకుమారి, టీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌, కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్‌ లక్ష్మి, శేషుకుమారి,అరుణ, ఆకుల రూప, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.


logo