సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:47:33

కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు

కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు

  • హోం మంత్రి మహమూద్‌అలీ 

చార్మినార్‌  : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వైరస్‌ వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి మహమూద్‌అలీ తెలిపారు. ఆదివారం పాతనగరంలోని చార్మినార్‌, మక్కా మసీదు వద్ద అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కరోనా మహమ్మారిని అరికట్టడానికి భౌతికదూరం పాటిస్తూ.. స్వీయ రక్షణ పొందాలని సూచించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడకుండా.. ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. కరోనా చికిత్స కోసం తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని,  మరికొన్నింటి కోసం ఆర్డర్‌ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, కార్పొరేటర్‌ సోహెల్‌ ఖాద్రీ, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


logo