మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 20, 2020 , 00:41:44

కరోనా కట్టడికి మార్కెట్లలో చర్యలు

కరోనా కట్టడికి మార్కెట్లలో చర్యలు

సిటీబ్యూరో,  నమస్తే తెలంగాణ:  కరోనా నేపథ్యంలో నగరంలోని మార్కెటింగ్‌ అధికారులు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రమిస్తున్నారు.  కూరగాయలు, నిత్యావసర  వస్తువుల కొరత లేకుండా చూసేందుకు అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వెళుతున్నారు.  వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, రైతుకూలీలు, హమాలీలు, వ్యాపారుల రక్షణ కోసం  మార్కెటింగ్‌ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  కూరగాయలను కాలనీలకు పంపడం నుంచి మార్కెట్లో సామాజిక దూరం పాటించడంలో  తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నారు.   సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు  మైక్‌సెట్లను అభివృద్ధి చేశారు. మొబైల్‌ మార్కెట్లను రియల్‌టైం జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.  సీసీ కెమెరాలలో చూస్తూ మార్కెట్లో ఏ మూలన జనాలు ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడినా అక్కడ ఉన్న వ్యాపారిని వారిని చెదరగొట్టేలా సూచనలు చేస్తున్నారు. వినని వారిపై మార్కెట్‌ రూల్స్‌ ప్రకారం జరిమానా విధించడం, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారు.  ప్రతి వారం రసాయనాలతో మార్కెట్లను పూర్తిగా శుభ్రం చేయిస్తున్నారు 


logo