సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:33:51

అర్ధరాత్రి పురిటినొప్పులు.. దవాఖానకు తీసుకెళ్లిన పోలీసులు

అర్ధరాత్రి పురిటినొప్పులు.. దవాఖానకు తీసుకెళ్లిన పోలీసులు

చాదర్‌ఘాట్‌, ఏప్రిల్‌ 19: కట్టెలగూడ ఉస్మాన్‌పురాకు చెందిన రబీయ ఉన్నీసాకు ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సౌకర్యం లేదు. దీంతో రబీయ ఉన్నీసా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తల్లి, సోదరితో కలిసి కష్టంగా కాలినడకన  దవాఖానకు బయలుదేరారు.  మీర్‌చౌక్‌ పోలీసులకు సమాచారం అందడంతో చాదర్‌ఘాట్‌ పోలీసులకు తెలిపారు. పెట్రోలింగ్‌  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అబ్దుల్‌ మతీన్‌, హోంగార్డు మస్తాన్‌ వలీ  వెంటనే పెట్రోలింగ్‌ కారులో మలక్‌పేట ఏరియా దవాఖానకు తరలించారు. ఆదివారం ఉదయం రబియాఉన్నీసా ఆడబిడ్డకు జన్మచిచ్చింది.  


logo