శనివారం 30 మే 2020
Hyderabad - Apr 20, 2020 , 00:33:20

ఏదీ సామాజిక దూరం

ఏదీ సామాజిక దూరం

కంటోన్మెంట్‌/చందానగర్‌ నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్లపైకి యథేచ్చగా వాహనాలు దూసుకువస్తున్నాయి. ఆదివారం మటన్‌, చికెన్‌, చేపల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఆయా దుకా ణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా విక్రయాలు జరిపారు. కొన్నిచోట్ల మాంసం దుకాణాదారులు గ్లౌజ్‌లు,  మాస్కులు కూడా పెట్టుకోకుండా విక్రయాలు జరుపగా మరికొన్ని చోట్ల మాంసం కోసం వచ్చిన వారు మా స్కులు లేకుండా, చిన్నపిల్లలతో కనిపించారు.. అదేవిధంగా నిత్యావసరాలు, కూరగాయల దుకాణాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలో ఉంటున్న ఇతర రాష్ర్టాల వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, రూ.500 నగదును అందజేస్తున్నది. రెవె న్యూ, పౌర సరఫరాల అధికారులు వీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే ఇతర రాష్ర్టాల వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, స్థానికులు సైతం క్యూలో బియ్యం కోసం నిల్చొని ఇబ్బందులు కలిగిస్తున్నారు. మన రాష్ర్టానికి చెందిన వారికి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం, రూ.1500 నగదును అందజేస్తున్నామని చెబుతున్నా పట్టించుకోవడంలేదు.  కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని బోయిన్‌పల్లి సంజీవవయ్యనగర్‌ కాలనీ, బాపూజీనగర్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది.  బోయిన్‌పల్లి పోలీసులు సంజీవయ్యనగర్‌ కాలనీలో స్థానికులను  లాఠీలతో చెదరగొట్టాల్సి వచ్చింది. 


logo