బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 18, 2020 , 23:25:39

దాతల సహకారం

దాతల సహకారం

 • హబ్సిగూడలో వలస కార్మికులు, పేదలకు 200 మందికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ స్వప్నారెడ్డి, ఎమ్మెల్యే కుమారుడు సుమంత్‌రెడ్డి ఆహార ప్యాకె ట్లు అందజేశారు.  ఉప్పల్‌ గ్రామ పెద్దలు చల్ల రాజిరెడ్డి ఆధ్వర్యం లో సరుకులను, ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులకు శానిటైజర్స్‌, వస్తువులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, నాయకులు మణిపాల్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, సురేందర్‌, గోవర్ధన్‌ పంపిణీ చేశారు.
 • కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని మెడికల్‌ షాపుల యజమానులతో డీసీలు కృష్ణశేఖర్‌, శైలజ సమావేశం నిర్వహిం చారు. దగ్గు, జలుబు మందుల కోసం వచ్చేవారి వివరాలు సేకరించాలని కోరారు. రేషన్‌ కార్డులు లేని వలస కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై డీసీ చర్చించారు. 
 • కాప్రాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో  వల స కూలీలకు బియ్యం, సరుకులను ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్‌ స్వర్ణరాజు అందజేశారు.  నాయకులు మహేందర్‌రెడ్డి, కొప్పుల కుమార్‌, ఎస్‌ ఐ మదన్‌లాల్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌  ఉన్నారు
 • నాచారంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మల్లికార్జున్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సరుకులు పంపిణీ చేశారు. రామంతాపూర్‌ కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో, రామంతాపూర్‌ లక్ష్మీగణపతి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారు వెంకట్రావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, ఫుడ్‌ ప్యాకెట్స్‌ను పంపిణీ చేశారు. 
 • రామంతాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు బియ్యం, మున్సిపల్‌ పారిశుధ్య  సిబ్బందికి ఫుడ్‌ ప్యాకెట్స్‌ను ఐవీఎస్‌ సికింద్రాబాద్‌ సేవాదళ్‌ చైర్మన్‌ నీరజ పంపిణీ చేశారు.
 • సోలీస్‌ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో  ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను టీఆర్‌ఎస్‌ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్‌ వేణుగోపాల్‌చారి,  వైద్యశాల చైర్మన్‌  రామాంజనేయులు, నాయకు లు కొత్త రామారావు ప్రారంభించారు.  
 • చర్లపల్లి ఈసీనగర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్తిరెడ్డి, నాగేశ్వర్‌రావు, సర్కిల్‌ ప్రాజెక్ట్‌ అధికారిణి ఇందిరా సుమారు 2వేల మాస్కులను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు అందజేశారు. శుభోదయనగర్‌ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ముత్యంరెడ్డి, మల్లేశ్‌, అంబేద్కర్‌నగర్‌లో కాలనీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో  అధ్యక్షుడు అబ్బయ్య సరుకులను అందజేశారు. 
 • హెచ్‌బీకాలనీలో కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య ఆధ్వర్యంలో బియ్యం, సరుకులు, నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో  సరుకులు పంపిణీ చేశారు.
 • ఉప్పల్‌లో మార్నెని ఫణీందర్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్యాకెట్లు, మాస్కులను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, శామీర్‌పేట ధర్మారెడ్డి అందించారు.
 • వేంకటేశ్వరకాలనీ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ కార్పొరేటర్‌ భారతీనాయక్‌తో కలిసి సరుకులందజేశారు.
 • హిమాయత్‌నగర్‌ కార్పొరేటర్‌ జె.హేమలతాయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు బాబుయాదవ్‌ నారాయణగూడలో పారిశుధ్య కార్మికులకు బియ్యం,నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
 • ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.5లోని దేవరకొండ బస్తీలో పేదలకు ,జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సరుకులను పంపిణీ చేశారు.
 • ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఇందిరానగర్‌ బస్తీలో వంట సరుకులను అందజేశారు. 
 • తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలో లింగోజిగూడ డివిజన్‌ అధికారినగర్‌లో 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, కోలా శ్రీనివాస్‌, గాయకులు సాయిచంద్‌, భాస్కర్‌, సుబ్బారావు, విజయలక్ష్మి, శైలజ, మాలతి, వరలక్ష్మి, అశ్విన్‌ పాల్గొన్నారు. 
 • నాగోలు డివిజన్‌ బీజేపీ ఇన్‌చార్జి  కన్నాగౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ సెల్‌ కార్యవర్గ సభ్యుడు వర్కాల బాల్‌రాజ్‌ సాయంతో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు చెందిన వలసకూలీలకు బియ్యం, గోధుమ పిండి అందజేశారు.
 • అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ లచ్చిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • చంపాపేటలో కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500లు అందజేశారు.
 • ఆదిత్యా చారిటబుల్‌ ట్రస్టు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నందకిషోర్‌ వ్యాస్‌  గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 25కిలోల బియ్యం సంచులను అందించారు. 
 • గౌలిగూడలో గడ్డం గంగాధర్‌ యాదవ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పేదలకు సరుకులను పంపిణీ చేశారు.
 • గోషామహల్‌లో బీజేపీ రాష్ట్ర  నాయకుడు డి. గోపాల్‌జీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
 • బేగంబజార్‌లో బీజేపీ నాయకుడు రమేశ్‌లాల్‌ యాదవ్‌ అన్నదానం చేశారు. 
 • గౌలిగూడలో బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌ నిత్యావసర సరుకులను, వలస కూలీలకు మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌ 12 కిలోల బియ్యం,  రూ.500  నగదును అందజేశారు. 


logo