ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 18, 2020 , 23:20:38

‘పరామర్శ’తో.. 34 మందికి పాజిటివ్‌

‘పరామర్శ’తో.. 34 మందికి పాజిటివ్‌

చార్మినార్‌: అనారోగ్యానికి గురైన బంధువును పరామర్శించడానికి వచ్చిన వ్యక్తితో ఏకంగా 34 మందికి కరోనా వ్యాపించింది.  భవానీనగర్‌ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన వృద్ధ్దురాలు (85) గుండెజబ్బుతో బాధపడుతూ పురాణి హవేలీలోని ఓ దవాఖానలో చికిత్స పొంది డిశ్చార్జి అయింది. ఇంటికి చేరుకున్న వృద్ధ్దురాలిని పరామర్శించడానికి కరోనా లక్షణాలతో బాధపడుతున్న బాలాపూర్‌కు చెందిన వారి బంధువు వచ్చాడు. అతడు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా వృద్ధ్దురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు. కొంత కాలం తర్వాత వృద్ధ్దురాలిలో కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. గుండె జబ్బుగా భావించి గతంలో చికిత్స చేసిన దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స నిర్వహించిన వైద్యులు  కరోనా లక్షణాలను గుర్తించి గాంధీకి  తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఇటీవల మృతి చెందింది. విషయం గుర్తించిన అధికారులు గతంలో వైద్యం చేసిన సిబ్బంది, కుటుంబ సభ్యులతోపాటు స్థానికులకూ పరీక్షలు నిర్వహించారు. వైద్యురాలితో పాటు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, కుటుంబ సభ్యులు, పక్కింటి వారు కలిపి మొత్తం 34 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి గాంధీకి తరలించారు. వీరితో సన్నిహితంగా ఉన్న మరో 21 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 


logo