బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 23:37:15

ఆపత్కాలంలో అద్భుత యంత్రం

ఆపత్కాలంలో అద్భుత యంత్రం

  • 600 లీటర్లతో 18 కిలోమీటర్ల మేర పిచికారి
  • ముందుకొచ్చిన పెస్టోమెన్‌ ఏషియన్‌ కంపెనీ

ఖైరతాబాద్‌ : కరోనా కట్టడికి ప్రభుత్వంతోపాటు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.  ఇటలీలో రూపుదిద్దుకున్న మిస్ట్‌ బ్లోయర్‌ యూఎల్‌వీ ఫాగింగ్‌ మిషన్‌ను  పెస్టోమెన్‌ ఏషియన్‌ కంపెనీ తెలంగాణాలో పరిచయం చేస్తున్నది. ఖైరతాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో  ఈ యంత్రం పనితీరుపై డెమో ప్రదర్శించారు.

గంటల వ్యవధిలోనే..

యంత్రంలోని  ట్యాంక్‌లో  600 లీటర్ల ద్రావణాన్ని నింపి ట్రాక్టర్‌కు అమర్చి వినియోగించుకోవచ్చు. దీంతో అతి సూక్ష్మస్థాయిలో బిందువులు పిచికారీ అవుతాయి. ఇందులో బాసిల్లోసిడ్‌ రసాయన ద్రావణాన్ని వినియోగిస్తామని  సంస్థ మేనేజర్‌ కె. సురేశ్‌ తెలిపారు.  600 లీటర్ల ద్రావణాన్ని గంటల వ్యవధిలో 18 కిలోమీటర్ల మేర గృహ సముదాయాలకు పిచికారీ చేయవచ్చన్నారు. ట్రాక్టర్‌తో కలిపి ఈ యంత్రం రూ.14 లక్షలు విలువ చేస్తుందన్నారు.కాలనీలు ముందుకు వస్తే నామమాత్రపు రుసుంతో శానిటైజ్‌ చేస్తామన్నారు.


logo