శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 23:29:49

పోలీస్‌ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

పోలీస్‌ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ :  రూ. 10 లక్షల విలువైన  మాస్కులు, శానిటైజర్‌, ప్రొటెక్టర్‌, గ్లౌస్‌లతో కూడిన కిట్‌లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌తో కలిసి నార్త్‌జోన్‌ పోలీసు సిబ్బందికి పంపిణీ చేశారు.  నార్త్‌జోన్‌ డీసీపీ కమలేశ్వర్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, మహంకాళి గోపాలపురం, బేగంపేట ఏసీపీలు వినోద్‌, శ్రీనివాసరావు, నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పోలీసులకు మాస్కులు, బాటిళ్లు

పోలీసులకు మాస్కులు, వాటర్‌ బాటిళ్లను ఎపిక్‌ సిస్టమ్స్‌ సంస్థ శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు అందించారు. అలాగే సీసీ టీవీ ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు వినోద్‌కుమార్‌, జీహెచ్‌ఎమ్‌సీ ఆసరా కేంద్ర కమిటీ సభ్యులు దాదాపు 3500  మాస్కులను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు అందించారు. ఈసందర్భంగా వారు పోలీసు సేవలను అభినందించారు.

ట్రాఫిక్‌ పోలీసులకు కరోనా సేఫ్టీ సామగ్రి అందజేత

ట్రాఫిక్‌ పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు, ఫేష్‌ షీల్డ్‌లను నగర పోలీసు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం అందించారు. సినీ డైరెక్టర్‌ హరిష్‌ శంకర్‌, కేఆర్‌కే రాజులతో పాటు సామాజిక కార్యకర్త జీవన్‌ ప్రసాద్‌లు వీటిని ట్రాఫిక్‌ పోలీసులకు అందించారు. దాంతో పాటు ఫేష్‌షీల్డ్‌లను జీఎస్‌ గుప్తా, వాహనాలలో క్రిములను నివారించేందుకు ఉపయోగించే స్ప్రేలను భీమా గౌడలు అందించారని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఉపయోగించే ఇన్నోవా కార్లపై కూడా స్ప్రే చల్లి వాటిని శుభ్రం చేశారు.  ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై ఉండి పోరాటం చేస్తున్నారని ఆయా వస్తువులు అందించిన వారు పోలీసుల సేవలను కొనియాడారు. హైదరాబాద్‌ను కరోనా ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలందరు ఇండ్లలోనే ఉండాలని అదనపు సీపీ సూచించారు, అత్యవసర పరిస్థితుల్లో 040-27852482, వాట్సాప్‌ నంబర్‌ 9010203626 నంబర్లకు ఫోన్‌ చేయాలని, 24/7 అందుబాటులో ఉంటామన్నారు.


logo