శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 09:20:39

పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

 • పేదలను ఆదుకునేందుకు బాలానగర్‌ మైక్రోస్మాల్‌ ఇండస్ట్రియల్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు అంబటి సునీల్‌కుమార్‌ సభ్యులు బాలాజీ, రమణతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు రూ.లక్ష చెక్కును అందజేశారు.
 • బాధితుల సహాయార్థం జీడిమెట్ల డివిజన్‌ స్ప్రింగ్‌ ఫీల్డ్‌ కాలనీపృథ్వీ ఓపెల్సె వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జమ చేసిన రూ.1,25,500చెక్కును పీఎం కేర్స్‌ఫండ్స్‌కు బ్యాంకులో జమ చేశారు.
 • కంటోన్మెంట్‌ బోర్డుకు ఇసాక్‌ కాలనీకి చెందిన నర్సింగరావు రూ.లక్ష, కమల్‌ రూ.50వేల చెక్కులను బోర్డు సీఈవో ఎస్వీఆర్‌ చంద్రశేఖర్‌కు తన కార్యాల యంలో అందజేశారు. 
 • రసూల్‌పురా జంక్షన్‌లో దాత తేజస్విని అందజేసిన సరుకులతోపాటు పోలీసు లకు జ్యూస్‌ ప్యాకెట్లను నగర సీపీ అం జనీకుమార్‌ పంపిణీ చేసి మొబైల్‌ వ్యాన్‌ను పరిశీలించారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగనావర్‌, కమిషనరే ట్‌ ప్రధాన కార్యాలయ డీసీపీ గజా రావు భూపాల్‌, అదనపు డీసీపీ డి.సు నీతారెడ్డి, నార్త్‌జోన్‌ అదనపు డీసీపీ ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 • నగరపోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం లో స్వీపింగ్‌ కార్మికులకు సరుకులను సీపీ అంజనీకుమార్‌ అందజేశారు.
 • బేగంపేట్‌ కుందన్‌బాగ్‌లో పారిశుధ్య కార్మికులకు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సరుకులు అందజేశారు.
 • రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి డివిజన్‌లో పేదలకు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి సరుకులు, గుడ్లుపంపిణీ చేశారు.
 • కవాడిగూడ డివిజన్‌లోని దోమలగూడ బండానగర్‌లో పేదలకు ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ సరుకులు అందజేశారు.
 • అల్వాల్‌ పంచశీల్‌కాలనీలో కార్మికులకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు సరుకులు అందజేశారు.
 • l బాలాజీనగర్‌లోని ఆంజనేయనగర్‌, హబీబ్‌నగర్‌లో ఎమ్మెల్యే కృష్ణారావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • ఈసీఐఎల్‌ చౌరస్తాలోని సోలీస్‌ కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ పావనీ మణిపాల్‌రెడ్డి, రామాంజనేయులు పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • కూకట్‌పల్లిలో పేదలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు సబీహా బేగం, శ్రావణ్‌కుమార్‌, జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాస్‌రావు డివిజన్లలో సరుకులు పంపిణీ చేశారు. 
 • శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో పేదలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • అత్తాపూర్‌ కార్పొరేటర్‌ రావుల విజయ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పారిశుధ్య సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. 
 • జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన పేదలకు బియ్యం పంపిణీ చేశారు. 
 • బోరబండలో ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ ఎస్సై అశోక్‌నాయక్‌తో కలిసి డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ సరుకులను పంపిణీ చేశారు.
 • నిమ్స్‌ దవాఖానలోని ఎమర్జెన్సీ, డయాలసిస్‌ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, రోగులకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి 300మాస్కులు అందజేశారు
 • ఉప్పల ఫౌండేషన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త చైతన్యపురి, మారుతీనగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో పేదలకు, కూలీలకు ఆహారం ప్యాకెట్లను అందజేశారు. 
 • పేద పూజారులకు గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ సరుకులు అందించారు. 
 • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దత్తత గ్రామం గుమ్మడవెల్లిలో పద్మావతి రైస్‌మిల్‌ యాజమాని కోడూరు వెంకటేశంగుప్త రేషన్‌ కార్డులులేని పేదలు, పంచాయతీ కార్మికులు, కామాటి వాటర్‌మెన్‌లకు  సరుకులు పంపిణీ చేశారు. 
 • భోలక్‌పూర్‌ మహాత్మానగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కనకేశ్‌కుమార్‌ పేదలకు సరుకులు అందించారు.
 • చిక్కడపల్లి త్యాగరాయగానసభలోని ఉద్యోగులకు అవాకేర్‌ఫౌండేషన్‌ అధ్యక్షురాలు ఆత్మీయ లక్కరాజు నిర్మల  సరుకులను గానసభ అధ్యక్షుడు కళా వీఎస్‌ జనార్దనమూర్తికి అందజేశారు.
 • సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసర బస్తీ పేదలకు, లాలాపేట, మల్కాజిగిరి బ్రాహ్మణ అసోసియేషన్‌ ద్వారా పురోహితులకు, హనుమాన్‌నగర్‌ ప్రాంతా ల్లో అవా కేర్‌ఫౌండేషన్‌ తరఫున లక్కరాజు నిర్మల సరుకులు పంపిణీ చేశారు.        
 • ఆరో వార్డులోని హరియంత్‌ కాలనీకి చెందిన భాస్కర్‌రావు, పి.పాల్‌ పారిశుధ్య కార్మికులకు బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ జె.రామకృష్ణసరుకులు పంపిణీ చేశారు.
 • పాత బోయిన్‌పల్లిలోని స్వర్ణధామనగర్‌లోని గుడిసెవాసులకు బోయిన్‌పల్లి పోలీసులు సరుకులు పంపిణీ చేశారు.
 • కంటోన్మెంట్‌ సీనియర్‌ నాయకుడు గజ్జెల నగేశ్‌ పారిశుధ్య కార్మికులకు  భోజనం అందజేశారు. 
 • మారేడ్‌పల్లిలోని నెహ్రూనగర్‌ పార్కు లోని మల్టీపర్పస్‌ కమ్యూనిటీహాల్‌లోని రైల్వే ప్రయాణికులు నిత్యం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ ఆకులరూప భోజనం అందజేశారు. 
 • సికింద్రాబాద్‌ గురుద్వారా మందిర్‌ ఆధ్వర్యంలో పేదలకు, అనాథలకు సరుకులు, పండ్లు అందజేశారు.
 • చైతన్యపురి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ యూ త్‌వింగ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి సు మారు 500 కుటుంబాలకు సరుకులు, మాస్కులు, గ్లౌజ్‌లు అందజేశారు.
 • గడ్డిఅన్నారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు గండి సన్ని  పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • చంపాపేట సుల్తాన్‌వల్వాలో కార్పొరేట ర్‌ రమణారెడ్డి సరుకులు అందించారు.
 • నిజాంపేటలోని మేయర్‌ క్యాంపు కా ర్యాలయంలో మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. 
 • బాచుపల్లి 1వ వార్డు కార్పొరేటర్‌ విజయలక్ష్మి సుబ్బారావుతో కలిసి మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డి పారిశుధ్య కార్మికులకు సరుకులు, ఆహారం అందజేశారు.
 • సాయినగర్‌లోని కార్మికులకు మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డి అన్నదానం చేశారు. 
 • ఆటో కార్మికులకు వినాయక్‌నగర్‌ స్లమ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌, చంద్రగిరికాలనీకి చెందిన అనఘా ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల హరికృష్ణ కుటుంబసభ్యులు కూలీలకు సరుకులు అందజేశారు.


logo