శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:45:22

వలస కార్మికుల జీవనోపాధిపై సర్వే

వలస కార్మికుల జీవనోపాధిపై సర్వే

  • శాంతినగర్‌లో సర్వే ప్రారంభం l 150 కుటుంబాల జీవన స్థితిగతుల అంచనా

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వలస కార్మికులు, కూలీల   జీవనోపాధికి సంబంధించి సర్వేను టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ భాగస్వామ్యంతో చేస్తున్నట్లు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు. బుధవారం జవహర్‌నగర్‌ పరిధిలోని శాంతినగర్‌లో సర్వే మొదలైందని, కమిషనరేట్‌ ప్రాం తంలో దాదాపు 28వేల మంది కార్మికులు ఉన్నారన్నారు. దాదాపు 150 మంది కార్మిక కుటుంబాల జీవన స్థితిగతులను అంచనా వేశామన్నారు.వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజనం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏదైన సేవలు పొందాలంటే రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ 9490617234కు ఫోన్‌ చేసి సంప్రదించాలన్నారు. 

వైద్యులు,పోలీసులు గ్రేట్‌

కరోనాపై చేస్తున్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడుతూ నగరంలోని 10 స్కూళ్లకు చెందిన 950 మంది విద్యార్థులు గ్రీటింగ్‌ కార్డులను తయారు చేసి బుధవారం అబిడ్స్‌ జీపీఓ సర్కిల్‌లో ప్రదర్శనకు పెట్టా రు. వీటిని పరిశీలించిన హైదరాబా ద్‌ సీపీ అంజనీకుమార్‌ విద్యార్థులు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.


logo