శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:41:57

పేదలకు అండగా..

పేదలకు అండగా..

 • పారిశుధ్య కార్మికులు, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నట్లు నగర మేయర్‌ రామ్మోహన్‌ పేర్కొన్నారు. పదిరోజుల నుంచి ఆయన నివాసం సమీపంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు,పోలీసులకు అల్పాహారం, టీలు అందజేస్తున్నా రు. బుధవారం 300 మందికి స్వయంగా మేయర్‌ సతీమణి శ్రీదేవి అల్పాహారం అందించారు.
 • పేదలకు సరుకులను పంపిణీ చేసేం దుకు హైదరాబాద్‌ నుంచి మహబూ బ్‌నగర్‌కు వెళ్తున్న రవాణా వాహనా లను కాచిగూడలోని టూరిస్ట్‌ ప్లాజా హోటల్‌ వద్ద మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు.
 • దోమలగూడలోని బస్తీల్లో ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదలకు సరుకులను వైశ్య ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త పంపిణీ చేశారు. 
 • కుత్బుల్లాపూర్‌ గాజులరామారం  సర్కిళ్ల పరిధిలోని జీడిమెట్ల, చింతల్‌ డివిజన్‌లలోని ఓల్డ్‌చింతల్‌, వినాయక్‌నగర్‌లో ఎమ్మెల్యే వివేకానంద్‌  250మందికి సరుకులు, ఆహారపొట్లాలను పంపిణీ చేశారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప, కాకతీయనగర్‌లో మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డి,గోపాల్‌రెడ్డిలు భవన నిర్మాణ కార్మికులు, కూలీలకు కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు. 
 • గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌ పేదలకు బియ్యం పంపిణీ చేశారు. 
 • టీఎన్‌జీవో సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందికి బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు,రూ.500 పంపిణీ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక చక్రవర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి 115 మంది సిబ్బందికి పంపిణీ చేశారు. 
 • ఖైరతాబాద్‌లోని రాజ్‌నగర్‌లో పేదలకు సరుకులను కార్పొరేటర్‌పి.విజయారెడ్డి పంపిణీ చేశారు. 
 • 100మంది కార్మికులకు బియ్యం, సరుకులను నారాయణగూడ పీఎస్‌ సీఐరమేశ్‌కుమార్‌, అడ్మిన్‌ ఎస్సై డి.కర్నాకర్‌రెడ్డి అందజేశారు. 
 • మెట్టుగూడ డివిజన్‌ హమాలీ బస్తీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయిబాబా పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌ పూలమార్కెట్‌ వ్యాపారుల అసోసియేషన్‌ వారు హమాలీలకు సరుకులు పంపిణీ చేశారు.
 • ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ దత్తాత్రేయ కాలనీలో దీవి బ్రదర్స్‌ సంస్థ యజమాని డీవీ రాజు పారిశుధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు.
 • పేదలకు సరుకులు, దుస్తులు సంఘ్‌ కేంద్ర సమితి అధ్యక్షుడు పర్మానంద్‌ శర్మ,ఉపాధ్యక్షుడు వినాయక్‌కుమార్‌ యాదవ్‌ పంపిణీ చేశారు.
 • మున్సిపల్‌ సిబ్బందికి అడిక్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని రామాలయం వీధిలో ఎన్‌ఆర్‌ఐ శేషాసాయి, సుబ్రహ్మణ్యం సరుకులు అందజేశారు. 
 • పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి 600 ఫేస్‌ మాస్క్‌లను న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ గోవర్ధన్‌రెడ్డి పంపిణీ చేశారు.  
 • గడ్డిఅన్నారం డివిజన్‌లోని పీఅండ్‌టీ కాలనీ కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజినల్‌ డైరెక్టర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్ల కరోనా స్పెషల్‌ అధికారి పంక జ, సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ హరికృష్ణయ్య, సరూర్‌నగర్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నోడల్‌ అధికారి నీలిమ సందర్శించారు.  
 • జవహర్‌నగర్‌కార్పొరేషన్‌లో మేయ ర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌ పేదలకు పండ్లను పంపిణీ చేశారు.శ్రీబాలాజీ ట్రేడర్స్‌ ఆధ్వర్యం లో పేదలకు  ఆహారం అందజేశారు.  
 • మేడ్చల్‌ మండలం ఎల్లంపేటలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, సర్పంచ్‌ వెన్నెల కూరగాయలు అందజేశారు.  
 • నర్సాపూర్‌ చౌరస్తాలోని ఎంఎస్‌ఎంఈ వద్ద ఎంఎల్‌ఆర్‌ఐటీ దుండిగల్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారం, మాస్కులు అందజేశారు. 
 • మోహన్‌నగర్‌ శృంగేరీ కాలనీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు కన్నయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సరుకులు, మహిళా మండలి ఆధ్వర్యంలో కూరగాయలు అందజేశారు. 
 • జయచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మలక్‌పేట్‌లోని పారిశుధ్య కార్మికులకు సంస్థ చైర్‌పర్సన్‌  దేవిరెడ్డి కమలారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • మన్సూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫొటో జర్నలిస్టులకు సరుకులు అందజేశారు.
 • సరూర్‌నగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పేద విద్యార్థుల కుటుంబాలకు రూ.లక్ష విలువైన సరుకులు కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రావుతో కలిసి పంపిణీ చేశారు.
 • చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని మదీనగూడ, సాయినగర్‌ తదితర కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌ పర్యటించారు. పోలీసుల పర్యవేక్షణ, నిత్యావసర సరుకుల పంపిణీ, వైద్య సిబ్బంది పరీక్షలు, రసాయనాల పిచికారీ తదితర చర్యలపై ఉపకమిషనర్‌ సుదాంశ్‌ను అడిగి తెలుసుకున్నారు.  
 • మాదాపూర్‌ పరిధిలోని వలస కూలీ లు, పేదలకు కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ భోజనం అందజేశారు.
 • చందానగర్‌లో టీఆర్‌ఎస్‌ నేత గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ నవతారెడ్డి సరుకులు అందజేశారు.
 • మల్లంపేట, బహదూర్‌పల్లి తదితర వార్డుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌ పర్యటించి కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని సెయింట్‌ థెరిస్సా స్కూల్‌ ఆధ్వర్యం లో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ పావనీ మణిపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. 
 • రామంతాపూర్‌లో శ్రీనివాస్‌ తండ్రి హనుమాండ్ల వెంకటస్వామితో కలిసి పేదలకు టిఫిన్‌ అందజేస్తున్నారు.


logo