శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:37:00

పీపీఈ కిట్ల విరాళం

పీపీఈ కిట్ల విరాళం

సుల్తాన్‌బజార్‌, బన్సీలాట్‌పేట్‌: ఉస్మానియా దవాఖానకు కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ 1500 పీపీఈ కిట్లను అందించింది. బుధవారం సూపరింటెండెంట్‌ నాగేందర్‌కు సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ కేంఎంకే రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆదికేశవ నాయుడు, కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌ గార్గ్‌, సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అశ్విన్‌ తుంకూర్‌  కిట్లను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌  సాయిశోభ, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌  శ్రీనివాసులు, అనస్త్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ పాండునాయక్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌  కె. నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రావణ్‌కుమార్‌కు గతి ఎనలిటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 200, ఎన్టీపీసీ 100 పీపీఈ కిట్‌లను విరాళంగా అందజేసింది. ఇక్రా గ్రూప్‌ ఆఫ్‌ డాక్టర్స్‌, ఎడ్ల ట్రస్ట్‌, నాట్కో ట్రస్ట్‌, క్లాస్‌ ఆఫ్‌ పీటీపీ మ్యాక్స్‌ సంస్థలు కూడా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు, ఫేషియల్‌ టిష్యూలు, గాగుల్స్‌ను విరాళం ఇచ్చాయి.


logo