బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:35:37

పేదలకు అండగా ...

పేదలకు అండగా ...

 • రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్‌నగర్‌, కార్మికనగర్‌లలో రెండు అన్నపూర్ణ క్యాంటీన్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ప్రారంభించారు. రోజుకు 1000 మందికి రెండు పూటలా భోజనం అందిస్తామన్నారు.
 • ఎర్రగడ్డ డివిజన్‌లో శానిటేషన్‌లో భాగంగా గౌతంపురికాలనీ, పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ స్వయంగా రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు.
 • నాంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌, నగర మాజీ మేయర్‌, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్‌తో కలిసి ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు.  
 • గాంధీనగర్‌లో పేదలకు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బడీ మసీద్‌ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. 
 • లాలాపేటలోని ఆర్యనగర్‌లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవి నేరుగా తయారు చేసిన అల్పాహారం ప్యాకెట్లను సుమారు 150 మందికి తార్నాక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతితో కలిసి పంపిణీ చేశారు. 
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ బాకారం బస్తీ దవాఖానలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ కార్యదర్శి వై.శ్రీనివాస్‌రావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజరై వైద్య, పారిశుధ్య సిబ్బందికి, పేషెంట్లకు మాస్కులు పంపిణీ చేశారు. 
 • మన్సూరాబాద్‌ డివిజన్‌ విజయశ్రీ కాలనీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తయారు చేయించిన 2వేల మాస్కులను కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అందజేశారు. 
 • కూకట్‌పల్లి పట్టణ మహిళా సమైక్య తరఫున మాస్కుల తయారీకి పెట్టుబడిగా రూ.2.50 లక్షల మొత్తాన్ని టీఎల్‌ఎఫ్‌ అధ్యక్షురాలు మంజుల ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగానికి అందించారు.  
 • కూకట్‌పల్లి నియోజకవర్గంలో నిరుపేదలు, వలస కార్మికులకు అత్యావసర పరిస్థితుల్లో ఫోన్‌ చేస్తే ఇంటికే నేరుగా బియ్యం, పప్పును పంపిణీ చేయనున్నట్టు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. 
 • కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో ఎమ్మెల్యే మాధవరం, నాయకులు వెంకటేశ్వర్‌రావు, సాయిబాబా చౌదరిలతో కలిసి క్రైస్తవులకు బియ్యం, పప్పు, కూరగాయలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సొంత ఖర్చులతో 70 వేల మందికి బియ్యం, పప్పును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 
 • ఉప్పల్‌లోని బిక్కుమళ్ల బ్రదర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని 500 మంది పేదలకు ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పంపిణీ చేశారు. 


logo