బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 23:54:32

ఉచితంగా క్యాబ్‌ సర్వీసులు

ఉచితంగా క్యాబ్‌ సర్వీసులు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీనియర్‌ సిటిజన్స్‌, ఒంటరి తల్లులు, దివ్యాంగులకు అత్యవసర పరిస్థితుల్లో  ఉచిత రవాణా సేవలు అందించేందుకు మహేంద్ర లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. సంస్థ ఆధ్వర్యంలో అలైట్‌ క్యాబ్‌ సర్వీసులను మంగళవారం కమిషనరేట్‌ కార్యాలయం వద్ద సీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మందులు, నిత్యావసర వస్తువులు, బ్యాంకు, పోస్టాఫీసులు, వైద్యుల అపాయింట్‌మెంట్‌తో వెళ్లే వారికి, పిల్లలకు నెలవారీగా వైద్యులు పిల్లలకు ఇచ్చే ఇంజక్షన్లకు వెళ్లే వారితో పాటు ఆహారపు సంబంధిత సామగ్రి, మందులు పంపిణీ చేసే వలంటీర్లు, హెల్త్‌ వర్కర్స్‌ విధుల కోసం హాజరయ్యే వారికి ఈ క్యాబ్‌లు ఉచితంగా సేవలు అందిస్తాయన్నారు. నగరంలో 10 క్యాబ్‌లను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని, 24/7 సేవలు అందిస్తాయని వివరించారు. ఈ క్యాబ్‌ సర్వీసులు  కావాల్సిన వారు  8433958158 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ చౌవాన్‌, సంస్థ రీజినల్‌ హెడ్‌ శివాలి బోయిర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo