శనివారం 30 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 23:53:17

మార్కెట్లలో.. మరిన్ని క్రిమిసంహారక టన్నెల్స్‌

మార్కెట్లలో.. మరిన్ని క్రిమిసంహారక టన్నెల్స్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే మార్కెట్లకు వచ్చే వారిని కరోనా, ఇతర వైరస్‌ల నుంచి కాపాడే క్రమంలో భాగంగా క్రిమి సంహారక టన్నెల్స్‌ ఏర్పాటు చేశారు. మెహిదీపట్నం, ఎర్రగడ్డ, సరూర్‌నగర్‌  రైతుబజార్లతో పాటు మలక్‌పేట, బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్లలో కూడా ఈ టన్నెల్స్‌ ఏర్పాటు చేశారు.  వీటి మీదుగా ప్రజలు 10 నుంచి 20 సెకన్ల పాటు నడవడం వల్ల లోపల స్ప్రే అయ్యి ద్రావణం శరీరంపై మొత్తం వ్యాపించేలా క్రిమిసంహారక రసాయన అణువులు పడతాయి.దీంతో శరీరంపై, వస్ర్తాలపై ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో ప్రజలు ఎటువంటి వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉండదు.  ఈ క్రమంలో టన్నెల్‌ లోపలికి వెళ్లిన వారు రసాయనాలు పడకుండా కండ్లు మూసుకో వడం మంచిది. ప్రస్తుతం ఈ పద్ధతి విజయవంతం కావడంతో నగర వ్యాప్తంగా మరిన్ని చోట్ల టన్నెల్స్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


logo