ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 23:51:29

వయసు చిన్నది..ఆలోచన గొప్పది

వయసు చిన్నది..ఆలోచన గొప్పది

జవహర్‌నగర్‌ : చిన్న వయసులో పెద్ద మనస్సును చాటుకున్నారు నలుగురు స్నేహితులు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 7వ డివిజన్‌, బీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్న అరవింద్‌ (7వ తరగతి), స్టీఫెన్‌ (5 తరగతి), ప్రణీశ్‌ (9 తరగతి), వివేక్‌ (8వ తరగతి) తమ తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులను వేసవిలో ఆట వస్తువులను కొనుగోలు చేసేందుకు కిడ్డీ బ్యాంకులో దాచుకున్నారు. కరోనా నేపథ్యంలో తాము దాచుకున్న డబ్బులతో బియ్యం కొనుగోలు చేసి పేదలకు అందించాలని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల  ఔదార్యానికి ముగ్ధులైన తల్లిదండ్రులు రూ.7,200తో 1.5 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి మేయర్‌ మేకల కావ్య సమక్షంలో కార్పొరేటర్‌ ఆశాప్రదీప్‌కుమార్‌కు పేదల కోసం అందజేశారు. తోటి వారికి సహాయం చేయాలని ముందుకొచ్చిన పిల్లలను మేయర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మేకల అయ్యప్ప, నాయకుడు వెంకన్న, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.


logo