బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 00:28:56

సేవలు చేసి.. చేయూతనిచ్చి

సేవలు చేసి.. చేయూతనిచ్చి

చందానగర్‌,  నమస్తే తెలంగాణ : మియాపూర్‌ న్యూ కాలనీ రోడ్‌ నం.10లో నివాసం ఉండే రాజు మద్యానికి బానిసై లాక్‌డౌన్‌లో మద్యం దొరక్క అనారోగ్యానికి గురై కదల లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక వార్డు మెంబర్‌ వరలక్ష్మి పారిశుధ్య కార్మికుల సహకారంతో అతనికి స్నానం చేయించి, అన్నం తినిపించి చందానగర్‌లోని మున్సిపల్‌ కల్యాణ మండపంలో సంకల్ప్‌ ఫౌండేషన్‌ నిర్వహణలో కొనసాగుతున్న నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. అభాగ్యుడి పట్ల వార్డు మెంబర్‌ చూపిన శ్రద్ధకు స్థానికులు అభినందనలు తెలిపారు. logo