బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 00:27:12

24 గంటలూ ఇండ్లలోనే..

24 గంటలూ ఇండ్లలోనే..

  • కరోనా నియంత్రిత ప్రాంతంగా తుర్కపల్లి.. ఇంటింటికీ సరుకుల పంపిణీ 
  • మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు 

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మేడ్చల్‌ జిల్లా పరిధిలోని తుర్కపల్లి గ్రామాన్ని కలెక్టర్‌ కరోనా నియంత్రిత ప్రాంతంగా ప్రకటించారు. గ్రామంలోని ప్రజలందరూ 24 గంటలు ఇండ్లలోనే ఉండాలని కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సిన నిత్యవసరాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.  తుర్కపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.  కంట్రోల్‌ రూం నంబర్‌కు ఫోన్‌చేస్తే వెంటనే నిత్యవసరాలను ఇంటింటికీ అందించేలా ఏర్పాట్లు చేశామని  సూచించారు. అడిషనల్‌ కలెక్టర్లు విద్యాసాగర్‌, జాన్‌ శ్యాంసన్‌, డీఆర్వో మధుకర్‌ రెడ్డి, కీసర ఆర్డీవో ఎన్‌.రవీందర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ చందర్‌సింగ్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నారాయణరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. logo