శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 12, 2020 , 23:05:36

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే..జైలే

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే..జైలే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులు తప్పని సరిగా  న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 11వ తేదీ వరకు  27,198 పెటీ కేసులు నమోదు చేశారు.  దాంతో పాటు  ఐపీసీ సెక్షన్ల కింద 785 కేసులకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కూడా కేసులు నమోదు  చేస్తున్నారు. 

కేసులు ఇలా..

  • సెక్షన్‌ 188 : ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897, సెక్షన్‌ 2 కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
  •  సెక్షన్‌ 269: ప్రమాదకరమైన వ్యాధి వ్యాప్తి కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగంపై ఆరు నెలల వరకు జైలు 
  • సెక్షన్‌ 270 : ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారనే నేరం కింద  రెండేండ్ల వరకు జైలు
  • సెక్షన్‌ 271 : వ్యాధి కట్టడికి దిగ్బంధించిన ప్రదేశాల్లో నిబంధనల ఉల్లంఘన కింద ఆరు నెలల వరకు జైలు  
  • సెక్షన్‌ 54: విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం తప్పుడు ప్రచారం, పుకార్లు సృష్టించే వారికి ఏడాది వరకు జైలు 
  • సెక్షన్‌ 336:  ప్రాణాలకు ప్రమాదం కల్గించే విధంగా వ్యవహరించే వారిపై మూడు నెలల వరకు జైలు 

ఉల్లంఘనలు వద్దు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు, తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.అందరూ అప్రమత్తంగా ఉండాలి

-సెంట్రల్‌జోన్‌ జాయింట్‌ సీపీ, విశ్వప్రసాద్‌


logo