బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 12, 2020 , 23:04:08

బ్యాంక్‌ అకౌంట్‌ లేనివారు డీలర్లను సంప్రదించాలి

బ్యాంక్‌ అకౌంట్‌ లేనివారు డీలర్లను సంప్రదించాలి

ఎల్బీనగర్‌ : కరోనా నేపథ్యం, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇప్పటివరకు 75 లక్షల రేషన్‌కార్డు దారులకు బియ్యం పంపిణీ పూర్తయ్యిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్‌ మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్‌ నియోజకవర్గం చంపాపేట డివిజన్‌ బైరామల్‌గూడలోని రేషన్‌ దుకాణాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్‌ సామ రమణారెడ్డిలతో కలిసి సందర్శించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 నగదును అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వలస కార్మికులు, అడ్డా కూలీలకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యంతో పాటుగా రూ.500 నగదును అందజేస్తున్నామని తెలిపారు. రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా దాదాపు 85 శాతం వరకు పూర్తయ్యిందన్నారు. బ్యాంక్‌ అకౌంట్లు లేని వారు రేషన్‌ డీలర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ హరీశ్‌, సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎస్‌ఓ రాథోడ్‌, ఏఎస్‌ఓ బాల సరోజ, అధికారులు పాల్గొన్నారు. 


logo