శనివారం 30 మే 2020
Hyderabad - Apr 11, 2020 , 23:58:18

కిడ్డీబ్యాంక్‌ నుంచి 51 వేలు విరాళం

కిడ్డీబ్యాంక్‌ నుంచి 51 వేలు విరాళం

అమీర్‌పేట : చాక్లెట్ల కోసం మారాంచేసే వయసున్న అమ్మాయి.. కరోనాపై  ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి తానూ తోడుంటానంటూ ముందుకువచ్చింది. చాలాకాలంగా కిడ్డీబ్యాంకులో దాచుకున్న రూ.51వేల మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేసి స్పందించే మనసుకు వయసుతో సంబంధంలేదని నిరూపించింది అమీర్‌పేట డీకే రోడ్డులోని నారాయణ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న అక్షర. తన తండ్రి గణేశ్‌, కార్పొరేటర్‌ శేషుకుమారితో కలిసి శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చెక్కు రూపంలో విరాళమందించారు.


logo