గురువారం 28 మే 2020
Hyderabad - Apr 11, 2020 , 23:48:53

అందరి ఆకలిని తీరుస్తున్నాం: మంత్రి తలసాని

అందరి ఆకలిని తీరుస్తున్నాం: మంత్రి తలసాని

అబిడ్స్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరి ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. స్వామి దయానంద్‌నగర్‌లో ఆదిత్యా కృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిషోర్‌వ్యాస్‌ ఆధ్వర్యంలో వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయగా మంత్రి హాజరై పేదలకు పంపిణీ చేశారు. గోషామహల్‌ నియోజకవర్గం ఆరు డివిజన్ల పరిధిలోని అన్ని ప్రాంతాలలో నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని, బస్తీల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిషోర్‌ వ్యాస్‌ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్వీ మహేందర్‌, మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అనిత, నరేందర్‌యాదవ్‌, దుర్గం రాధాకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్‌, సురేశ్‌ముదిరాజ్‌ పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధికి  సనత్‌నగర్‌ ప్రజల వితరణ రూ. 7.57 కోట్లు

అమీర్‌పేట్‌ : కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి ప్రజలు అందిస్తున్న సహకారం అపూర్వమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆపత్కాలంలో ప్రభుత్వానికి సనత్‌నగర్‌ నియోజకవర్గం ప్రజలు అండగా నిలిచారన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి నేటి వరకు సనత్‌నగర్‌ నియోజకవర్గం తరపున దాతలు రూ. 7.57 కోట్ల నిధులను అందించి తమ వితరణను చాటుకున్నారని ప్రశంసించారు. శనివారం ఉదయం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు నగరంలో అన్నపూర్ణ భోజన శిబిరాలను 150కి పెంచామని దాదాపు 70 క్యాంటీన్ల ద్వారా రెండు పూటల భోజనాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐసోలేషన్‌ కోసం 20 వేల పడకలను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచిందన్నారు. 


logo