గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 11, 2020 , 23:47:33

సైబరాబాద్‌లో 5045వాహనాలు సీజ్‌...

సైబరాబాద్‌లో 5045వాహనాలు సీజ్‌...

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్‌ పరిధిలోని మొత్తం 1.15 లక్షల సీసీ కెమెరాలు, డ్రోన్‌ పెట్రోలింగ్‌తో నిత్యం ఉల్లంఘనలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే తాజాగా రాష్ట్ర పోలీసులు ప్రవేశ పెట్టిన లాకౌడౌన్‌ వయోలేషన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌ ద్వారా చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు వారి ట్యాబ్‌లో పరిశీలిస్తే...వాహనదారుడు నిబంధనలకు విరుద్ధంగా ఎంత దూరం ప్రయాణించాడన్న సమాచారం నిమిషాల్లో తెలిసిపోతుంది. దీంతో అతని మీద కేసుతో పాటు వాహనాన్ని సీజ్‌ చేస్తున్నారు. ఇలా.. సైబరాబాద్‌ పరిధిలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 11 వరకు మొత్తం 457 ఉల్లంఘనల కేసులను నమోదు చేయగా.. 5045 పైగా ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. 


logo