శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 11, 2020 , 23:45:53

ఎస్‌ఆర్‌డీపీ పనులు వేగవంతం

ఎస్‌ఆర్‌డీపీ పనులు వేగవంతం

ఎల్బీనగర్‌  : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉన్న ట్రాఫిక్‌ ఆంక్షల దృష్ట్యా ఎస్‌ఆర్‌డీపీ పనులను వేగవంతం చేసి త్వరితగతిన ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులోని అండర్‌పాస్‌, ఫ్లైఓవర్‌, బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ పనులను శనివారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు నుంచి నగరానికి వచ్చే రహదారిపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌కు అడ్డుగా ఉన్న ఎల్బీనగర్‌ ప్రసన్నాంజనేయ దేవాలయం ప్రాంగణంలోని షాపుల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ విజయకృష్ణ, కార్పొరేటర్లు చెరుకు సంగీత, ముద్రబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.   

పారిశుధ్య కార్మికులకు బియ్యం, పప్పు..

ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో ఆహార పదార్థాలకోసం ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. పేదలకు పంపిణీ చేసేందుకుగాను నగరంలో పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి బియ్యం, పప్పు దినుసులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  ఆర్చ్‌ డయోసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థ శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 175 క్వింటాళ్ల బియ్యం, 30క్వింటాళ్ల పప్పు దినుసులను మేయర్‌కు అందజేశారు.logo