గురువారం 28 మే 2020
Hyderabad - Apr 10, 2020 , 23:36:46

పెద్దమనసుతో సాయం చేశారు

పెద్దమనసుతో సాయం చేశారు

 • బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వలస కార్మికులు, పేద వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • చంపాపేట డివిజన్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్ల రఘుమారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ  నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
 • మన్సూరాబాద్‌ డివిజన్‌లో పేదలకు కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి,  డీసీ మారుతీదివాకర్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌, కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పద్మానగర్‌ఫేజ్‌-2లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • నిజాంపేట కార్పొరేషన్‌ పరిధి 12 వార్డులో మేయర్‌ కొలన్‌నీలాగోపాల్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 
 • రామంతాపూర్‌కు చెందిన మున్సిపల్‌ జవాన్‌ సిద్ధయ్య  వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ పేదలకు నిత్యావసర వస్తువులు అంజేశారు.
 • చర్లపల్లి డివిజన్‌ ఆదర్శనగర్‌ కాలనీలో వీ కేన్‌ మేక్‌ ఏ చేంజ్‌  సంస్థ ఆధ్వర్యంలో  టీఆర్‌ఎస్‌ నాయకుడు మల్లేశ్‌ వంశరాజ్‌, సంస్థ ప్రతినిధులు రాజేశ్‌ వంశరాజు, రాజు  సరుకులు పంపిణీ చేశారు. 
 • ఆర్యవైశ్య సేవాసమితి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌ నాచారంలో 600 కుటుంబాలకు బియ్యం సరుకులు అందించారు.
 • కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో  పేద ముస్లింలకు  నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. 
 • నగరంలోని 200 మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం 60 వేల మాస్క్‌లను జీహెచ్‌ఎంసీ తయారు చేయిస్తున్నది.  ఇప్పటివరకు 20 వేల మాస్కులు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. 
 • మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గోకుల్‌ఫ్లాట్స్‌ ఆధ్వర్యంలో 500 మంది వలస కూలీలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ  ఆహార పొట్లాలు అందించారు. 
 • విశ్వ హిందూ పరిషత్‌  అఖిల భారత ఉప ప్రధాన కార్యదర్శి రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, తెలంగాణ ప్రాంత కార్యదర్శి బండారి రమేశ్‌ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • పెరికె సోమయ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి ఆహార పొట్లాలను అందజేశారు.
 • కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫీడ్‌ ది నీడ్‌ కార్యక్రమంలో భాగంగా 22 వేల టన్నుల కూరగాయలు, నిత్యావసరాలను  పంపిణీ చేయనున్నారు.
 • రోడ్డుపై  సామగ్రితో తరలివెళ్తున్న వలస కూలీలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్‌ రహదారి వద్దకు చేరుకొని వలస కూలీలతో మాట్లాడారు. వారికి మధ్యాహ్న భోజనంతోపాటు రూ.500 నగదు అందజేశారు. 
 • సైదాబాద్‌ జయనగర్‌లో చినజీయర్‌ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్లను పేదలకు అందజేస్తున్న కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, చినజీయర్‌ స్వామి సేవా సమితి ప్రతినిధులు రావికంటి శ్రీనివాస్‌ గుప్తా, మురళి, పరమేశ్‌ ముదిరాజ్‌, వెంకటేశ్‌, జగన్‌  అందించారు.
 • కీసర మండలం చీర్యాలలో ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ గ్రామ ప్రజలకు సరిపడ కూరగాయలు, పప్పు తదితర వస్తువుల పంపిణీని మంత్రి మల్లారెడ్డి  ప్రారంభించారు. 
 • పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో, ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ గ్రామంలో పేద ప్రజలకు మంత్రి మల్లారెడ్డి కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. 
 • మేడ్చల్‌ మండలంలోని రాయిలాపూర్‌ గ్రామంలో ఇంటింటికీ సర్పంచ్‌ నర్మదా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, ఎంపీపీ పద్మా జగన్‌రెడ్డిలు ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ నేత మర్రి  రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డిలు కౌన్సిలర్‌ గణేశ్‌తో కలిసి ఇతర రాష్ర్టాలకు చెందిన 200 మంది కుంటుంబాలకు బియ్యం, కూరగాయలు అందజేశారు.
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ మహాత్మానగర్‌లో భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బస్తీవాసులకు, పేద ప్రజలకు ఇంటింటికీ తిరుగుతూ ఆహార పొట్లాలను ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పంపిణీ చేస్తున్నారు.
 • లాక్‌ డౌన్‌లో పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు అవసరపడే మాస్క్‌లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సతీమణి కావ్య కిషన్‌రెడ్డి సొంతంగా తయారు చేసి అందించారు. తానే స్వయంగా ఇంట్లో మాస్కులు కుట్టి పోలీసులకు పంపిణీ చేశారు.
 • లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కూలీలకు, పేదలకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • ఫిలింనగర్‌లోని నవ నిర్మాణనగర్‌ బస్తీలో  టీఆర్‌ఎస్‌ నాయకుడు  సామ ఉపేందర్‌గౌడ్‌ సరుకులు పంపిణీ చేశారు.


logo