సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 09, 2020 , 23:55:18

మందుల కొరత లేకుండా సహకరించండి..

మందుల కొరత లేకుండా సహకరించండి..

  • రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వైద్యానికి సంబంధించిన మందులకు కొరత లేకుండా ఫార్మా కంపెనీలు సహకరించాలని సీపీ మహేశ్‌ భగవత్‌ కోరారు. ఈమేరకు గురువారం 200 మంది ఫార్మా ప్రతినిధులతో ఎల్బీనగర్‌ ప్రాంతంలో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ... ఫార్మా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల తయారీకి అవసరమున్న ముడిసరుకు సరఫరా ఆగకుండా సహకరించాలని వారు సీపీని కోరారు. దీనికి పూర్తిగా సహకరిస్తామని .. ఎటువంటి ఆటంకాలు ఉండవని సీపీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, డీసీపీలు,   ఫార్మా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


logo