మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 09, 2020 , 23:53:47

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

జీడిమెట్ల : స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. గురువారం సాయంత్రం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. చింతల్‌, గాజులరామారం, దేవేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ను ప్రజలు పాటిస్తున్న తీరును పరిశీలించారు. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయం, చింతల్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టువద్ద పలు వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో అధికారులతో సమావేశమై కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం ఇండ్లనుంచి ఎవరూ భయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 


logo