బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 09, 2020 , 23:51:20

సరుకులు ఇస్తాం.. ఆకలి తీర్చుతాం..!

సరుకులు ఇస్తాం.. ఆకలి తీర్చుతాం..!

  • పదివేల మందికి నిత్యావసర సరుకులు 
  • పంపిణీ చేయనున్న మంత్రి సబితారెడ్డి

బడంగ్‌పేట : ప్రజలెవరూ ఆకలితో అలమటించవద్దని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల ఇబ్బందులను గుర్తించిన మంత్రి దాదాపు నియోజకవర్గం పరిధిలోని పదివేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సరుకులను పరిశీలించి ప్యాకింగ్‌ చేయించారు. అనంతరం మహేశ్వరం మండలంలోని నాగిరెడ్డి పల్లి, గొల్లూరు, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వడగండ్ల కారణంగా నష్టపోయిన పంట పొలాలను జెడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి పరిశీలించారు. 


logo