బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 09, 2020 , 23:41:50

అనుమానాస్పదస్థితిలో టీవీ యాంకర్‌ మృతి

అనుమానాస్పదస్థితిలో టీవీ యాంకర్‌ మృతి

వెంగళరావునగర్‌: అనుమానాస్పదస్థితిలో టీవీ ఆర్టిస్ట్‌, యాంకర్‌ పదుల్లపర్తి విశ్వశాంతి అలియాస్‌ శాంతి మృతి చెందింది. ఎస్సార్‌నగర్‌ ఎస్సై కృష్ణయ్య కథన ం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన విశ్వశాంతి(33) ఎల్లారెడ్డిగూడ, ఇంజినీర్స్‌ కాలనీలోని ఫ్రిబ్జి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. టీవీ యాంకరింగ్‌తో పాటు పలు తెలుగు టీవీ సీరియళ్లలో పని చేస్తుంది. కాగా.. ఒంటరిగా ఉంటున్న విశ్వశాంతి.. మూడు రోజులుగా తన ఫ్లాట్‌ నుంచి బయటకు రాలేదు.  సమాచారం అందుకున్న పోలీసులు డోరు పగులగొట్టి.. చూడగా.. బెడ్‌రూంలో విగతజీవిగా పడి ఉంది. ఒంటిపై గాయాలై రక్తం కారినట్లుగా ఉంది. మృతి చెంది సుమారు రెండు, మూడు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలోనుంచి ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.  


logo