మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 09, 2020 , 23:40:06

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

 • డ్రగ్గిస్ట్‌ అండ్‌ కెమిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌,  ఏఎంహెచ్‌ఓ బిందు భార్గవ్‌లు మాస్కులు, శానిటైజర్లు పారిశుధ్య,  ఎంటమాలజీ సిబ్బందికి పంపిణీ చేశారు. 
 • కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో  మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మేడ్చల్‌  కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, జోనల్‌ కమిషనర్‌ మమత, డీసీ ప్రశాంతి, కార్పొరేటర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హైదరాబాద్‌ జిల్లాలో 24 వేల మందికి  సరుకులను అందజేశారు. 
 • నగరానికి చెందిన పెరిక సురేశ్‌ నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌, గాంధీ , ఎర్రగడ్డ ఛాతీ దవాఖానల సిబ్బందికి ఆహార పొట్లాలు అందజేశారు.
 • టీఆర్‌ఎస్‌ నాయకుడు దామోదర్‌రావు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ పాల్గొని కార్మికులకు సరుకులు అందించారు. 
 • ఆల్విన్‌కాలనీలో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌, హైదర్‌నగర్‌ డివిజన్‌ భాగ్యగనర్‌లో వార్డు సభ్యురాలు కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • మల్లాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు బోదాసు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు సరుకులు పంపిణీ చేశారు. 
 • పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని బీబీసాహెబ్‌ మక్తాలో కార్పొరేటర్‌ లేతాకుల మాధవీరఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌గౌడ్‌ 100 మంది పేదలకు సరుకులు అందించారు.
 • చర్లపల్లి, ఏఎస్‌రావునగర్‌ డివిజన్లలో పారిశుధ్య కార్మికులకు సెయింట్‌ థెరిస్సా పాఠశాల నిర్వాహకులు సరుకులు అందజేశారు. 
 • చిలుకానగర్‌లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఐకాన్‌ డీజీ స్కూల్‌ చైర్మన్‌ ఎలుగేటి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీల్లో సోడియం హైపో క్లోరైట్‌  పిచికారీ చేయించారు. 
 • కాప్రా కార్పొరేటర్‌ స్వర్ణరాజు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో పారిశుధ్య కార్మికులు, పోలీసులకు ఆహార పొట్లాలు అందించారు.  
 • కాప్రా డివిజన్‌ గాంధీనగర్‌లో స్థానిక వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.మహేశ్‌ ఆధ్వర్యంలో సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.         
 • జాంబాగ్‌లో నిరుపేదలకు నిత్యావసర సరుకులను టీఆర్‌ఎస్‌ నాయకుడు నందకిశోర్‌వ్యాస్‌ పంపిణీ చేశారు.
 • నటి అలేఖ్య యాంజెల్‌ ఆధ్వర్యంలో మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
 • కెనరా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తెలంగాణ ఆధ్వర్యంలో యూనియన్‌ చైర్మన్‌ ప్రసాద్‌, కార్యదర్శి మధుసూదన్‌లు పారిశుధ్య కార్మికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 
 • మెహిదీపట్నం భోజగుట్ట శ్రీరాంనగర్‌లో  నాంపల్లి టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సీహెచ్‌.ఆనంద్‌కుమార్‌గౌడ్‌  పేదలకు సరుకులు అందించారు.
 • ఆసిఫ్‌నగర్‌లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌, నగర మాజీ మేయర్‌, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో సరుకులు అందించారు.
 • బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ మల్లికార్జుననగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు అఖిలేశ్‌గౌడ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌  పారిశుధ్య కార్మికులు, పేదలు 500 మందికి ఆహార పొట్లాలు అందించారు.
 • కుత్బుల్లాపూర్‌ పరిధిలో సుమారు 200 మంది విలేకరులకు ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ  శంభీపూర్‌రాజులు జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో హెల్త్‌ కిట్లు పంపిణీ చేశారు.


logo