శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 08, 2020 , 23:49:21

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

  • మల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌కేవీ తెలంగాణ రాష్ట పౌరసరఫరాల శాఖ హమాలీ కార్మిక సంఘం తరఫున అధ్యక్షుడు సీహెచ్‌.శ్రీనివాస్‌ కురుమ సీఎం సహాయనిధికి రూ.2 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
  • యువ ఆటగాళ్లు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 1.05 లక్షలను సేకరించారు. ఇందుకోసం మంగళవారం www.lichess.org వేదికపై ఆన్‌లైన్‌లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించగా, ఒక అంతర్జాతీయ గ్రాండ్‌ మాస్టర్‌, ఏడుగురు అంతర్జాతీయ మాస్టర్లు, 60 మంది వరకు జాతీయ చదరంగ ఆటగాళ్లు  పాల్గొన్నారు.  వేదాంత్‌ పనేసర్‌, అంతర్జాతీయ ఆటగాడు యాష్‌ శ్రీవాస్తవ ఈ పోటీల్లో పాల్గొనగా,  నగరానికి చెందిన ఐఎం రవితేజ ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.  
  • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన బిల్డర్‌ రమణారెడ్డి రూ.2లక్షల 50వేలను, రాజమోహన్‌రెడ్డి  లక్ష చెక్కునను ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు ఆయన కార్యాలయంలో అందజేశారు.
  • జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రాజ్‌క్లాసిక్‌ పుడ్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమ సీఎం సహాయనిధికి రూ. 1,01,016  చెక్కును  పరిశ్రమ టెక్నికల్‌ డైరెక్టర్‌ రాజేశ్వర్‌రావు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కకు అందజేశారు.  
  • పింఛన్‌ డబ్బులను మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లకు జిల్లెలగూడ పలువురు లబ్ధిదారులు అందజేశారు.


logo