శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 08, 2020 , 23:42:22

రక్షణ కవచం...

రక్షణ కవచం...

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ:  దాతల సహాయంతో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో  3వీ సేఫ్‌ టన్నల్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రవేశించినప్పుడు అందులో ఉండే  త్రీ డీ అయోడిన్‌ పదార్థాన్ని చల్లుతుంది. ఇది శరీరంతో పాటు మొబైల్‌ ఫోన్‌, ఇతర వస్తువుల పడినప్పుడు అది ఒక  లేయర్‌ గా ఏర్పడి...మనిషికి రక్షణ కవచంగా ఏర్పడుతుంది. ఇది కరోనా వైరస్‌తో పాటు ఇతర వైరస్‌లను  దగ్గర రానివ్వదు. దీనిని వ్యాపారవేత్త మాగంటి రమణ రాచకొండ పోలీసులకు అందించారు. 

సేవలను అభినందిస్తూ.... 

ఇండస్‌ టవర్‌ సంస్థ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ చేతుల మీదుగా దాదాపు 200 పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌లను సిబ్బందికి అందజేసింది. అలాగే చిన్నారులు సాయమందించారు. వేణుమాధవ్‌, అతని పిల్లలు పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు రూ. 50 వేల అందించారు. 

2 వేల మందిపై కేసులు: సీపీ మహేశ్‌భగవత్‌

హోంగార్డు నుంచి సీపీ వరకు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ.. విధులు నిర్వహిస్తున్నామని, 42 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 2వేల మందిపై కేసులను నమోదుతో పాటు వాహనాలు  సీజ్‌ చేశామన్నారు.


logo