శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 23:50:52

మౌన నగరి..

మౌన నగరి..

నగరం ఇంటిపట్టునే ఉంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. కూడళ్లన్నీ బోసిపోయి.. చార్మినార్‌ ఒంటరై.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మూగబోయి.. నాంపల్లి జంక్షన్‌ కళ కోల్పోయి..మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ నిర్మానుష్యమై ఉంటుంది. ప్రధాన రహదారుల్లో ఎక్కడా ఒక్క మనిషీ కానరాక జనజీవనం పూర్తిగా స్తంభించి ఓ మౌనముని తపస్సు చేసుకుంటున్నట్టుగా ఉంది మన భాగ్య నగరం. లాక్‌డౌన్‌ కాలంలో చడీ చప్పుడు లేకుండా ఉన్న స్థాణువైన నగరం విహంగ వీక్షణ దృశ్యాలివి. 


logo