శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 23:49:53

నిత్యావసర వస్తువుల పంపిణీ

నిత్యావసర వస్తువుల పంపిణీ

బడంగ్‌పేట /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం ఆదేశాల మేరకు పేద, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్‌లో కార్పొరేటర్‌ పెద్ద బావి శోభాఆనంద్‌ రెడ్డి  ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి సబితారెడ్డి అందజేశారు. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో లాల్‌బహదూర్‌ స్టేడియంలో సుమారు 200 మంది పేద మహిళలకు 10 రకాల నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్‌ మమత గుప్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ షూటింగ్‌ క్రీడాకారిణి ఈషా సింగ్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ మమత, మేయర్‌ చిగిరింత పారిజాత , డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, తహసీల్దార్‌  శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌ సత్య బాబు,  కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్‌, పెద్ద బావి శోభ ఆనంద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo