గురువారం 28 మే 2020
Hyderabad - Apr 07, 2020 , 01:02:31

దారి మారితే.. దొరికిపోతారు

దారి మారితే.. దొరికిపోతారు

  • క్యూఆర్‌ కోడ్‌తో 938మందికి పాసులు జారీ  
  • పాసులు తీసుకున్న వారి చిట్టా రాచకొండ పోలీసుల గుప్పిట్లో..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:లాక్‌డౌన్‌ సందర్భంగా జారీ చేస్తున్న పాసులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే చర్యలు తప్పవని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పాసుకు క్యూఆర్‌ కోడ్‌ను పొందుపరుస్తున్నారు. దీంతో ఆ పాసులో అనుమతికి బదులుగా ఇతర సమయంలో గాని, ఇతర ప్రాంతాలకు వెళ్లినా చెక్‌ పోస్టు వద్ద ఉన్న పోలీసులకు, తనిఖీలు చేసే పోలీసు వారి వద్ద ఉన్న యాప్‌లో దీన్ని స్కాన్‌ చేస్తే చాలు పాసు అనుమతి ఎక్కడి వరకు ఎంత సమయం వరకు ఉందని  స్పష్టంగా తెలిసిపోతుం ది. దీనికి తోడు పాసు తీసుకున్న వ్యక్తి ఎన్నిసార్లు నిబంధనలను ఉల్లంఘించాడనే సమాచారం పోలీసులకు తెలిసిపోతుంది. దీంతో ఆ పాస్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు నమోదు చేసే అవకాశమున్నది. ఇప్పటి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 2500 వరకు పాసులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో 938 మందికి ఈ పాసులను జారీ చేయగా, మరో 958వరకు తిరస్కరించారు. మరో 800 పాసులు పరిశీలనలో ఉన్నాయి. పాసు దరఖాస్తు సందర్భంగా వారు నమోదు చేసుకున్న అవసరాలను పరిశీలించిన తర్వాతనే పాసులు జారీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా నిత్యావసరాల సామగ్రి సరఫరా, అందుబాటులో ఉండేందుకు అవసరమున్న వారందరికీ పాసులు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం జారీ చేశారు. మరికొంత మంది తప్పనిసరిగా ఉద్యోగాలకు హాజరు కావాల్సి ఉండడంతో వారికి రూటుతో కూడిన పాసును జారీ చేశారు. మొత్తానికి రాచకొండ పోలీసులు జారీ చేసిన పా సుల లబ్ధిదారులు ఏచిన్న తప్పు  చేసినా ఒక్క క్లిక్‌తో వారి చిట్టా ప్రత్యక్షమవుతుంది.


logo