బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 06, 2020 , 00:06:22

హైదరాబాద్‌ సేఫ్‌ సిటీకి..

హైదరాబాద్‌ సేఫ్‌ సిటీకి..

  • పోలీసులతో కలిసి పని చేస్తాం : ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా కలిసి చేస్తున్న సేవలు చాలా మంది గరీబోళ్ల కడుపు నింపుతున్నారు. అదే విధంగా ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్నారు. ఆదివారం ఓ గర్భిణీ మహిళకు అత్యవసర వైద్య సేవలను సైబరాబాద్‌ కోవిడ్‌ -19 కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సేవలను అందించారు. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరం పడడంతో ఎస్‌సీఎస్‌సీ వలంటీర్‌ రక్తదానం చేశారు. అదే విధంగా 19 కేంద్రాల ద్వారా దాదాపు 14200 మందికి భోజనాలను అందించారు. ఒక రోజే 1800 కాల్స్‌ సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది స్వీకరించి సేవలను అందించారు. హైదరాబాద్‌ సేఫ్‌ సిటీకి పోలీసులకు మద్దతుగా నిలబడేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు స్పష్టం చేశారు.


logo