శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 06, 2020 , 00:05:04

పోలీస్‌ కారులో గర్భిణి తరలింపు

పోలీస్‌ కారులో గర్భిణి తరలింపు

  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

బేగంపేట: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు మానవత్వం చాటారు. బేగంపేట బస్తీకి చెందిన జయలక్ష్మి(32) నిండు గర్భిణి. దీంతో దవాఖానకు వెళ్లాల్సి ఉండగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేశా రు. చాలా సేపటి వరకు అంబులెన్స్‌ రాకపోవడంతో బేగంపేట పోలీసులకు సమాచారం అం దించారు. దీంతో పెట్రోలింగ్‌ కారులో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ దవాఖానకు తరలించారు. కొద్ది సేపటికే జయలక్ష్మి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.


logo