సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 06, 2020 , 00:01:23

లాక్‌డౌన్‌తో కన్నతల్లి కడచూపునకు దూరం

లాక్‌డౌన్‌తో కన్నతల్లి కడచూపునకు దూరం

మేడిపల్లి: లాక్‌డౌన్‌లో నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కన్నతల్లిని కడసారి కూడా చూసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గౌరీ నాయుడు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి ఎల్లమ్మ(48), వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామం. కాగా కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో నిమగ్నమైన గౌరినాయుడికి శనివారం తల్లి అనారోగ్యంతో మృతిచెందిన సమాచారం అందింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో గౌరినాయుడు ఆదివారం అంత్యక్రియలకు వెళ్లకపోవడమే కాక లాక్‌డౌన్‌లో భాగంగా విధులు నిర్వహించడం తోటి సిబ్బందిని సైతం కంటతడి పెట్టించింది. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్‌ ద్వారా వీక్షించిన కానిస్టేబుల్‌ గౌరినాయుడిని సీఐలు అంజిరెడ్డి, మక్బూల్‌ జానీ, ఎస్సై రఘురాం పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.


logo