గురువారం 28 మే 2020
Hyderabad - Apr 05, 2020 , 23:59:16

దిగ్విజయం‘దీపయజ్ఞం’

దిగ్విజయం‘దీపయజ్ఞం’

  • మరోసారి ఐక్యతను చాటి చెప్పిన హైదరాబాదీలు 

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : చారిత్రక నగరం దేదిప్యమానంగా వెలిగిపోయింది. సామూహిక శక్తి ఎలుగెత్తి చాటింది. నలుదిశలా దీపకాంతులు వెదజల్లింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌  పిలుపు మేరకు తొమ్మిది గంటల సమయంలో తొమ్మిదినిమిషాల పాటు భాగ్యనగరం కాంతికిరణాలతో ప్రజ్వలించింది. కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారద్రోలి.. ప్రకాశవంతమైంది.  గత నెల 22న జనతా కర్ప్యూలో హైదరాబాదీలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దేశానికే ఒక సంఘీభావ సంకేతాన్ని అందిస్తే...ఆదివారం దీప యజ్ఞంలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించారు. కొవిడ్‌పై పోరులో సంకల్ప బలాన్ని చూపారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వరకు.. ఒక్కతాటిపై నిలిచి ఐక్యతను చాటారు. దీపాలు, టార్చ్‌ లైట్లు, మొబైల్‌ ఫోన్ల లైట్లతో అద్భుతాన్ని ఆవిష్క రించి... మేమంతా ఒకటేనని ప్రకటించారు.  


logo