శనివారం 30 మే 2020
Hyderabad - Apr 02, 2020 , 23:43:38

ఏ ఒక్కరినీ పస్తులుంచం

ఏ ఒక్కరినీ పస్తులుంచం

నమస్తే తెలంగాణ బృందం : లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పేర్కొన్నారు. గన్‌ఫౌండ్రి డివిజన్‌ కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మమతా సంతోష్‌ గుప్తా ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఆహార భద్రతా కార్డుదారులకు ప్రతి సభ్యుడికి పన్నెండు కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి 1500 రూపాయలు అందుతాయని తెలిపారు. వలస కూలీలకు 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయలను అంద చేస్తున్నట్లు వివరించారు. నగరంలోని నిరాశ్రయులకు ప్రత్యేకంగా ఓ ప్రాంతంలో ఉంచి వారికి ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  మొత్తం 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌, కిశోర్‌ బజాజ్‌,  డాక్టర్‌ మదన్‌ మోహన్‌, రాంచంద్రారెడ్డి, దిలీప్‌ గనాతే, శ్రీనివాస్‌ యాదవ్‌, సంజయ్‌, రేణుక, శిరీష్‌, నార్మన్‌ కొల్లిన్స్‌, సురేష్‌, ప్రభాకర్‌, అల్లం శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  మేడ్చల్‌లో దాతల సహకారంతో 500 మంది పేదలకు  బియ్యం పింపిణీ చేసిన కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డి,  వైస్‌ చైర్మన్‌ చీర్ల రమేశ్‌, కౌన్సిలర్లు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ మెట్టుగూడలోని వార్డు కార్యాలయంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో  డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పాల్గొన్నారు.  చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ భవనంలో సీఐఏ ఆధ్వర్యంలో వలస కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.  కాప్రా డిప్యూటీ కమిషనర్‌ శైలజ, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావు, సీఐఏ అధ్యక్షుడు జలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo