బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Mar 31, 2020 , 23:03:58

కొరత రాకుండా ఉల్లి దిగుమతి

కొరత రాకుండా ఉల్లి దిగుమతి

మలక్‌పేట: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మలక్‌పేట మహబూబ్‌ మ్యాన్షన్‌ మార్కెట్‌(గంజ్‌)లో ఉల్లిగడ్డ నిల్వలను భారీగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలనుంచి భారీగా ఉల్లి దిగుమతులను చేసుకుంది. సోమవారం మలక్‌పేట మార్కెట్‌కు 137 లారీల ఉల్లిగడ్డ రాగా, మహారాష్ట్ర నుంచి 68 లారీలు, కర్ణాటక నుంచి 10 లారీలు, కర్నూలు నుంచి 6 లారీలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 52 లారీల ఉల్లిగడ్డను తెప్పించారు.  మేలురకం ఉల్లిగడ్డ క్వింటాలుకు రూ.2400(కిలో రూ.24) ధర పలుకగా, మధ్యరకం రూ.2000(కిలో రూ.20)లు, నాసిరకం ఉల్లిగడ్డ రూ.1500(కిలో రూ.15) లు ధర పలికింది. కాగా మంగళవారం 157 లారీల(18,650 టన్నులు)ఉల్లిగడ్డ రాగా, మహారాష్ట్ర నుంచి 57 లారీలు రాగా, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలనుంచి 100 లారీల ఉల్లిగడ్డను దిగుమతి చేసుకున్నారు. ధర మేలు రకం రూ.2000 వేలు, మధ్యరకం రూ.1700, నాసిరకం రూ.1200 ధర పలికింది. 


logo